సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలోని రెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో పశువుల గర్భకోశ వ్యాధుల గురించి ప్రజలకు శనివారం పశు వైద్యాధికారి సుష్మిత వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, కృత్రిమ గర్భధారణ చేయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి శంకర్, గోపాలమిత్ర, సూపర్వైజర్ శ్రీనివాస్, నాగేల్లి శ్రావణ్, లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు.