సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల నుంచి గుండాల మండలం వస్తాకొండూరు గ్రామానికి వెళ్లడానికి బిక్కేరువాగుపై వంతెన, చెక్ డ్యాం నిర్మాణానికి నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా మంగళవారం రూ. 20. 37కోట్లు నిధులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేశారు. రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ ఆదేశాల మేరకు ఆగస్టు 29న బిక్కేరువాగులో ఆ శాఖ అధికారులు వంతెన, చెక్ డ్యాం నిర్మాణం కోసం పరిశీలన చేశారు.