సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాలలో కోతుల బెడద రోజురోజుకు అధికమవుతుంది. కోతుల వల్ల గీత కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. కోతులు తాటి చెట్లు పైకి ఎక్కి చెట్టుకు కట్టిన కళ్ళు ముంతలను సైతం తెంచి కళ్ళు తాగుతున్నాయి. కష్టపడి కళ్ళు గీసిన గీత కార్మికులకు అన్యాయం చేస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి కోతులను అరికట్టాలని స్థానిక గీత కార్మికుడు మామిడి సోమయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.