సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నిక సాధ్యం కాదని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ నాయకులు కోరారు. కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం కొమ్ముకాస్తుందని ఈ సందర్భంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొలిశెట్టి యాదగిరి రావు, బూర శ్రీనివాస్ గౌడ్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.