కాంగ్రెస్‌పై ఘాటు విమర్శలు చేసిన బాలగంగాధర్ తిలక్.. "స్వరాజ్యం నా జన్మహక్కు. దాన్ని నేను పొంది తీరుతాను" అని అన్నాడు. 1907లో మహారాష్ట్రలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ చీలిపోయింది. మితవాదులు కాంగ్రెస్ పై తమ పట్టును నిలబెట్టుకున్నారు. అతివాదులుగా పిలవబడే తిలక్, అతను మద్దతుదారులు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు. తిరిగి 1916లో లక్నోలో జరిగిన సమావేశంలో అంతా ఒకటయ్యారు. అదే సమావేశంలో కాంగ్రెస్‌కు, ముస్లిం లీగుకు మధ్య లక్నో ఒప్పందం కుదిరింది.