చాలా మంది చిన్నారుల్లో అంత త్వరగా మధుమేహ లక్షణాలు కనిపించవు. డయాబెటీస్ ముఖ్య లక్షణం బరువు తగ్గడం. హెల్దీగా ఉన్న చిన్నారులు ఉన్నట్టుండి బరువు తగ్గితే గనుక ఆలోచించాల్సిందే. షుగర్ వ్యాధి ఉంటే ఎక్కువగా దాహం వేస్తుంటుంది. కాబట్టి పిల్లలు నీరు ఎక్కువగా తాగుతుంటారు. పిల్లలు అతిగా మూత్ర విసర్జన చేస్తుంటారు. ముఖ్యంగా వారి కాళ్లు, చేతులకి ఎలాంటి దెబ్బలు తాకినా ఎలాంటి స్పర్శ ఉండదు. దీన్ని గుర్తించాలి. లేకపోతే వ్యాధి ముదిరి ఇబ్బందిగా మారుతుంది.