కొట్టకుండానే చేతి పంపులోంచి వస్తున్న నీరు (Video)

60చూసినవారు
ఏపీలోని కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. పులిగడ్డ గ్రామంలోని నాలుగు చేతి పంపుల్లో కొట్టకుండానే ధారాళంగా నీళ్లు వస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలతో గ్రామంలో భారీగా వరద నీరు నిలిచింది. దాంతో భూగర్భ జలాలు అధికంగా పెరిగాయి. ఈ క్రమంలోనే చేతిపుంపులను కొట్టకుండానే నీళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్