భారత్, సౌతాఫ్రికా జట్లు శనివారం టీ20 వరల్డ్ ఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ కీలక మ్యాచ్ ముందు కీలక ఆటగాళ్ల ఫామ్ భారత్‌ను కలవరపరుస్తోంది. ముఖ్యంగా కోహ్లి ఈ టోర్నీలో 7 మ్యాచ్‌లలో 75 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లి నుంచి భారీ ఇన్నింగ్స్‌ను ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరో వైపు దూబే వరుసగా మ్యాచ్‌లలో విఫలం అవుతూ వస్తున్నాడు. దూబే స్థానంలో స్పిన్, పేస్ రెండిటినీ ఆడగల సమర్ధుడైన సంజూ శాంసన్ జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి.