'మహిళలకూ సీడీఎస్ పరీక్ష అవకాశంపై నిర్ణయం తీసుకోండి'

53చూసినవారు
'మహిళలకూ సీడీఎస్ పరీక్ష అవకాశంపై నిర్ణయం తీసుకోండి'
ఇండియన్ మిలటరీ అకాడమీ (ఐఎంఏ), నేవల్ అకాడమీ(ఐఎన్ఏ), ఎయిర్ ఫోర్స్ అకాడమీ(ఏఎఫ్ఎ)ల్లో ప్రవేశం కోసం నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్(సీడీఎస్) పరీక్ష రాసే అవకాశాన్ని మహిళలకూ కల్పించాలన్న వినతిపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. 8 వారాల్లోగా తేల్చాలని పేర్కొంది. సీడీఎస్ పరీక్ష కోసం 2023 డిసెంబరులో UPSC జారీచేసిన నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది.

సంబంధిత పోస్ట్