అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు ఇండియన్స్ మృతి

62చూసినవారు
అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు ఇండియన్స్ మృతి
అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి 4-6 వరుసలు పల్టీ కొడుతూ చెట్లపైకి ఎగిరిపడి, ఇరుక్కుపోయింది. ఆ సమయంలో కారు గాల్లోకి 20 అడుగుల ఎత్తుకు లేచినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు దుర్మరణం చెందారు. మృతులు గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందిన రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మనీశాబెన్ పటేల్‌గా స్థానిక అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్