దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ 2024-25 జూన్‌తో ముగిసిన క్యూ1లో 5.7 శాతం వృద్థితో ఏకంగా రూ.1,07,316 కోట్ల రెవెన్యూ సాధించింది. ఇదే సమయంలో కంపెనీ నికర లాభాలు ఏకంగా 74 శాతం ఎగిసి రూ.5,566 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.3,203 కోట్ల లాభాలు ప్రకటించింది. గడిచిన క్యూ1లో రెవెన్యూ 5.1 శాతం పెరిగి రూ.17,800 కోట్లకు పెరగ్గా.. ప్యాసింజర్ వెహికల్స్ రెవెన్యూ 7.7 శాతం తగ్గి రూ.11,800 కోట్లుగా నమోదయ్యింది.