సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఒక సద్దాం హుస్సేన్ లాగా, ఒక గడాఫీ లాగా డిక్టేటర్ అయిపోయాడని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన ఏడాది పాలనలో ఎప్పుడూ గొడవలే జరిగాయన్నారు. హైదరాబాద్ నగరంలో వందల సంఖ్యలలో ఇళ్లను నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చేశారని, ఆయన సోదరుడి ఇంటిని మాత్రం కూల్చకుండా కాపాడుకొస్తున్నాడని విమర్శించారు.