కరివేపాకు సాగుతో అధిక లాభాలు

78చూసినవారు
కరివేపాకు సాగుతో అధిక లాభాలు
కరివేపాకు ఏడాదికి మూడు, నాలుగు కోతలొస్తుంది. భూమికి బెత్తెడు ఎత్తులో కోస్తాం. అలా కోసిన ఆకుతో 10 కేజీల చొప్పున కట్ట కడతాం. ఎకరానికి ఒక్కో కోతకు 80 క్వింటాళ్ల చొప్పున ఏడాదికి దాదాపు 240 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఏప్రిల్, మే నెలల్లోనే ధర కాస్త తక్కువగా ఉంటుంది. ఆగస్టు తర్వాత ధర వస్తుంది. ఒక్కో కట్టను ప్రస్తుతం రూ.200లకు విక్రయించవచ్చు. సీజన్‌లో రూ.450 పలుకుతుంది. అన్ని ఖర్చులు పోనూ ఎకరాకి రూ.లక్ష ఆదాయం వస్తోందని రైతులు చెప్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్