రైతులకు అండగా కూటమి ప్రభుత్వం: మంత్రి నిమ్మల

58చూసినవారు
రైతులకు అండగా కూటమి ప్రభుత్వం: మంత్రి నిమ్మల
AP: తాడేపల్లి సీఎఆర్ కళ్యాణమండపంలో మంగళవారం రాష్ట్ర వ్యవసాయ మిషన్ చైర్మన్‌గా మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ.. ఏపీని వ్యవసాయ రాష్ట్రంగా మార్చేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు పనులు 72 శాతం పూర్తి చేశామన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్