వాయిస్ కాల్స్, SMSల కోసం ప్రత్యేక రీఛార్జ్ పథకాలను టెలికాం సంస్థలు ఆవిష్కరించాలని ట్రాయ్ ఆదేశించింది. ప్రత్యేక రీఛార్జ్ కూపన్లకు 90 రోజుల సమయ పరిమితిని తొలగించి, దానిని 365 రోజులకు ట్రాయ్ పొడిగించింది. '365 రోజుల కాలపరిమితిని మించకుండా వాయిస్ కాల్స్, SMSల కోసం కనీసం ఒకటైనా ప్రత్యేక టారిఫ్ వోచర్‌ను టెలికాం సంస్థలు అందుబాటులో ఉంచాలి' అని ట్రాయ్ పేర్కొంది. అయితే కనీసం రూ.10 రీఛార్జ్ కూపన్ ఉండాలని తెలిపింది.