సోషల్ మీడియాలో ఓ కింగ్ కోబ్రాకు సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ పొడవాటి కింగ్ కోబ్రా పాము రోడ్డు పక్కన ఎటూ కదలకుండా పడుకుని ఉంటుంది. స్నేక్ క్యాచర్లు అక్కడికి వచ్చి పరిశీలించగా.. చివరకు కింగ్ కోబ్రా కడుపులో ఉన్నది కక్కేసింది. తీరా చూస్తే దాని కడుపు నుంచి మొత్తం మూడు పాములను బయటకు కక్కేసింది. ఇది చూసిన వారంతా షాక్ అయ్యారు.