బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ అనుచరుడికి నీట్ పేపర్ లీక్‌తో సంబంధం ఉందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు. ఈ విషయంపై డిపార్ట్‌మెంటల్ విచారణ జరిపినట్లు తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన తేజస్వి యాదవ్ వ్యక్తిగత కార్యదర్శి ప్రీతం కుమార్ బీహార్ రోడ్ కన్‌స్ట్రక్షన్ డిపార్ట్‌మెంట్ (ఆర్‌సీడీ) ఉద్యోగి ప్రదీప్‌తో మాట్లాడినట్లు తెలిపారు.