తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈనెల 9న ప్రారంభమైన సమావేశాలు 16కు వాయిదా పడ్డాయి. 16న తిరిగి ప్రారంభమై శనివారంతో ముగియనున్నాయి. ఇవాళ సభలో రైతు భరోసా పథకంపై అసెంబ్లీ, శాసన మండలిలో చర్చించనున్నారు. అనంతరం మంత్రివర్గం విధి విధానాలు ఖరారు చేసి, సంక్రాంతి తర్వాత నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు తెలుస్తోంది.