తెలంగాణలో ఉపాధ్యాయ నియామక
పరీక్షలు (DSC) షెడ్యూల్ విడుదల అయ్యింది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ
పరీక్షలు నిర్వహిస్తారు. సీబీఆర్‌టీ విధానంలో రోజుకు రెండు షిఫ్ట్‌లలో డీఎస్సీ
పరీక్షలు ఉంటాయి. జులై 18న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్ష ఉంటుంది. జులై 18న సెకండ్ షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష ఉంటుంది. జులై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష నిర్వహిస్తారు.