APGVB బ్రాంచ్‌లు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనమవుతున్న నేపథ్యంలో నేటి నుంచి ఈ నెల 31 వరకు TGB సేవలు నిలిచిపోనున్నట్లు ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. జనవరి 1 నుంచి బ్యాంక్ సేవలు పునరుద్ధరిస్తామని చెప్పారు. బ్రాంచ్‌ల విలీనం జరిగినా ఖాతా నంబర్లు మారవని స్పష్టం చేశారు. కస్టమర్ల అత్యవసరాల నిమిత్తం ఈ నెల 30, 31 తేదీల్లో రూ.10వేల వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు.