24న తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు

44858చూసినవారు
24న తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు
తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాలు ఈ నెల 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలను అధికారులు ఒకేసారి వెల్లడించనున్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. మొదటి, రెండో సంవత్సరాలకు కలిపి 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మరోవైపు పదోతరగతి పరీక్ష ఫలితాలను ఈ నెల 30 లేదా మే 1న విడుదల చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది.

సంబంధిత పోస్ట్