కృష్ణా జలాల్లో మెజారిటీ వాటా తెలంగాణకే దక్కాలి: మంత్రి

58చూసినవారు
కృష్ణా జలాల్లో మెజారిటీ వాటా తెలంగాణకే దక్కాలి: మంత్రి
TG: కృష్ణా జలాల విషయంలో తెలంగాణకి అన్యాయం జరగొద్దని మంత్రి ఉత్తమ్ అన్నారు. రేపు కృష్ణానది జలవివాదంపై విచారణ ఉన్న నేపథ్యంలో ట్రిబ్యునల్ కు నివేదించాల్సిన అంశాలపై ఢిల్లీలో సమీక్షించారు. ట్రిబ్యునల్ ముందు రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపిస్తామన్నారు. తెలంగాణలో సాగు విస్తీర్ణం ఎక్కువని, మెజారిటీ వాటా రాష్ట్రానికే దక్కాలని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం ఒప్పుకున్న ప్రతిపాదనను తాము అంగీకరించడం లేదని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్