హైదరాబాద్‌లో తాత్కలికంగా గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ మూసివేత

75చూసినవారు
హైదరాబాద్‌లో తాత్కలికంగా  గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ మూసివేత
TG: హైదరాబాద్‌లోని నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. GHMC SRDP అభివృద్ధి పనుల్లో భాగంగా శిల్పా లేఅవుట్ ఫేజ్-2 పరిధిలో కొత్తగా ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తున్నారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను తాత్కలికంగా మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈనెల 29వ తేదీ ఉ. 6 గంటల వరకు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ రూట్‌లో వెళ్లే వాహనదారులు ప్రత్నామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :