తాడేపల్లిలో ఉద్రిక్తత.. సర్పంచులు అరెస్ట్

3582చూసినవారు
తాడేపల్లిలో ఉద్రిక్తత.. సర్పంచులు అరెస్ట్
ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ సర్పంచుల సంక్షేమ సంఘం పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్పంచులు కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు సర్పంచులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. పోలీసులు వైఖరిపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హక్కుల కోసం పోరాడుతుంటే అరెస్టు చేస్తారా? అని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్