యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో బుధవారం భారీ తుఫాను సంభవించింది. దీని ఫలితంగా కద్రాలో భారీ ఎత్తున ధూళి తుఫాన్ రావడంతో వాతావరణంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అబుదాబి, షార్జా, రస్ అల్ ఖైమా, ఫుజైరాలో భారీ వర్షాలు, వడగళ్ళు ఈదురుగాలులు కురిశాయి. ఇంకా డస్ట్ డెవిల్స్, టోర్నడోలను పోలిన, కాల్బా, రస్ అల్ ఖైమాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.