ఉగ్రదాడి.. పిల్ల‌ల్ని బ‌స్సు సీటు కింద దాచిపెట్టిన తండ్రి

51చూసినవారు
ఉగ్రదాడి.. పిల్ల‌ల్ని బ‌స్సు సీటు కింద దాచిపెట్టిన తండ్రి
జ‌మ్మూక‌శ్మీర్‌లోని రియాసి జిల్లాలో ప‌ర్యాట‌కుల బ‌స్సుపై ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌రిపిన విష‌యం తెలిసిందే. ఆ కాల్పుల్లో 9 మంది మృతిచెందారు. అయితే ఢిల్లీకి చెందిన భ‌వానీ శంక‌ర్ అనే వ్యక్తి త‌న భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి ఆ బస్సులో వైష్ణ‌వోదేవి ఆల‌య ద‌ర్శ‌నం కోసం వెళ్లాడు. ఫైరింగ్ సమయంలో బుల్లెట్లు దూసుకొస్తున్న ఆ క్ష‌ణంలో ఎటు తోచక త‌న ఇద్ద‌రు పిల్ల‌ల్ని బ‌స్సు సీటు కింద న‌క్కిపెట్టిన‌ట్లు శంక‌ర్ తెలిపాడు. ఆ భ‌యాన‌క ప‌రిస్థితుల్ని ఎన్న‌టికీ మ‌రిచిపోలేన‌ని చెప్పాడు.