భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో పంచాయతీ ఓటర్ల జాబితా సవరణ షెడ్యూలులో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. రేపు ప్రకటించాల్సిన ముసాయిదా ఓటర్ల జాబితా ఈనెల 13న ప్రచురించనుంది. ఈనెల 18, 19 తేదీల్లో రాజకీయ పార్టీలతో సమావేశాలు ఉంటాయని ఎస్ఈసీ పార్థసారథి తెలిపారు. ఈనెల 28న వార్డుల వారీగా తుది జాబితా విడుదల చేస్తామని పేర్కొన్నారు.