రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం తీవ్ర విషాదం నెలకొంది. పట్టణంలోని వెంకంపేట్ లో బైరి అమర్ (50)- స్రవంతి (46) అనే చేనేత దంపతులు శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. గత కొంతకాలంగా పని దొరక్క.. చేసిన అప్పులు తీర్చే మార్గం తెలియక ఇంట్లో బలవన్మరణానికి పాల్పడినట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.