రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం కీచక టీచర్ బాగోతం వెలుగుచూసింది. సిరిసిల్ల- గీతానగర్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మైనర్ బాలికల ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ టీచర్ వేధించాడు. ఈ విషయం స్కూల్ హెచ్ఎంకి చెప్పినా పట్టించుకోవట్లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పక్కనే జిల్లా ఎస్పీ ఆఫీస్, పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ విషయం బయటకు రాకపోవడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.