కాంగ్రెస్‌లోని నలుగురు ఎమ్మెల్యేలు BRS పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ MLA దానం నాగేందర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కేసీఆర్, కేటీఆర్‌ను పొగడటం, హైడ్రాను తప్పు పట్టడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో దానం తిరిగి BRSలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాగేందర్‌తో పాటు మరో ముగ్గురు కాంగ్రెస్ MLAలు పోచారం శ్రీనివాసరావు, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, కాలె యాదయ్య మళ్ళీ BRSలో చేరేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.