హైదరాబాద్ లో ట్రాఫిక్ విధుల్లోకి చేరేందుకు ట్రాన్స్ జెండర్లకు నియమకాలు ప్రారంభం అయ్యాయి. తొలిసారిగా సిటీ కమిషనరేట్ పరిధిలో నియామకాలు జరుగుతున్నాయి. నగరంలోని గోషామహల్ స్టేడియంలో ట్రాన్స్ జెండర్లకు అధికారులు ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. రన్నింగ్, హైజంప్, లాంగ్ జంప్ లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తున్నారు. ఈవెంట్స్ తర్వాత మొత్తం 44 మందిని అధికారులు సెలెక్ట్ చేశారు. వీరికి ట్రైనింగ్ ఇచ్చి ప్రభుత్వం నియమించనుంది.