తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. డైట్, కాస్మొటిక్ ఛార్జీలను 40 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇవాళ మెట్టపల్లి గురుకుల పాఠశాల విద్యార్థినులు సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు చేసుకున్నారు. స్కూల్ పిల్లల్ని ఉచితంగా పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన "తెలంగాణ దర్శిని" కార్యక్రమంపైనా వారు తమ సంతోషాన్ని తెలియజేశారు.