అందుకే టికెట్ ధరలు పెంచాం: పవన్

79చూసినవారు
అందుకే టికెట్ ధరలు పెంచాం: పవన్
సినిమా వాళ్లు ప్రతి రూపాయికి 18% జీఎస్టీ కడుతున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అటువంటి సినిమాలకు పెట్టుబడులు కావాలంటే టికెట్ ధరలు పెంచాల్సిందేనని పేర్కొన్నారు. వకీల్ సాబ్ సమయంలో తాను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు, డబ్బులు లేనప్పుడు దిల్ రాజు అండగా నిలబడ్డారని తెలిపారు. ‘పేరు ఉంది.. కానీ డబ్బులు లేవు. మార్కెట్ ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో వచ్చి వకీల్ సాబ్ అనే సినిమా నాతో తీసి అండగా నిలిచారు’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్