ఆ ట్రాక్ ఇప్పటికీ బ్రిటీషర్లదే.. అద్దె చెల్లిస్తున్న రైల్వేశాఖ

57చూసినవారు
ఆ ట్రాక్ ఇప్పటికీ బ్రిటీషర్లదే.. అద్దె చెల్లిస్తున్న రైల్వేశాఖ
ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థల్లో భారతీయ రైల్వే కూడా ఒకటి. అయినప్పటికీ ఓ ట్రాక్‌పై రైలు నడిపేందుకు ఇప్పటికీ బ్రిటిషర్లకు రూ.కోటి అద్దె కడుతోంది. మహారాష్ట్రలోని యావత్మాల్-మూర్తిజాపుర్ మధ్య ఉన్న రైల్వే లైన్‌ను బ్రిటిషర్లు నిర్మించారు. వారు దేశం విడిచి వెళ్లినా ఆ లైన్ ఇంకా వారి అధీనంలోనే ఉంది. 1952లో రైల్వేల జాతీయాకరణ సమయంలో అధికారులు ఈ లైన్‌ను మర్చిపోవటంతో బ్రిటిషర్లకు భారత రైల్వే అద్దె కడుతోంది.

సంబంధిత పోస్ట్