టీ20 వరల్డ్ కప్‌లో 43 ఏళ్ల బౌలర్ సంచలనం

70చూసినవారు
టీ20 వరల్డ్ కప్‌లో 43 ఏళ్ల బౌలర్ సంచలనం
టీ20వరల్డ్ కప్‌లో ఉగాండా బౌలర్ ఫ్రాంక్ ఎన్‌సుబుగా సంచలనం సృష్టించారు. 43 ఏళ్ల ఈ బౌలర్ పపువా న్యూగినియాతో మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ వేసి కేవలం 4 పరుగులే ఇచ్చారు. అందులో రెండు వికెట్లు, 20 డాట్ బాల్స్ ఉండటం విశేషం. టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఇది అత్యుత్తమ ఎకానమీ(1.00). ఇదివరకు సౌతాఫ్రికా బౌలర్ బార్ట్‌మన్ పేరిట ఉన్న అత్యుత్తమ ఎకానమీ(2.25) రికార్డును ఫ్రాంక్ బద్దలు కొట్టారు. ఈ మ్యాచ్‌లో ఉగాండా గెలుపొందింది.

సంబంధిత పోస్ట్