TG: సౌమ్యుడు, మృదు స్వభావిగా చెప్పుకునే మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఒక్కసారిగా దూకుడు పెంచడం రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా ఈటల మాటల్లో పెద్దగా పంచ్ ఉండదనే కారణంతో తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వడంలో అధిష్టానం మీమాంస పడుతోంది. ఈ విషయం గ్రహించిన ఈటల రాజేందర్ అధిష్టానం దృష్టిలో పడాలనే ఆలోచనతోనే దూకుడు మార్గాన్ని ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.