కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద అర్ధరాత్రి ఏలూరు కాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. అయితే ప్రమాద సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. AP 39 UE 7843 టవేరా కారు కంకిపాడుకు చెందిన ఓ వ్యక్తిదిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.