టీనేజర్ల అరెస్టుపై సర్కారును ప్రశ్నించిన కోర్టు

70చూసినవారు
టీనేజర్ల అరెస్టుపై సర్కారును ప్రశ్నించిన కోర్టు
మైనర్‌ బాలికలతో డేటింగ్‌ చేసే మైనర్‌ బాలురను అరెస్ట్‌ చేయడం న్యాయమేనా? మైనర్‌ బాలికల తల్లిదండ్రులు ఆ బాలురపై ఫిర్యాదు చేయాలా? ఇటువంటి కేసుల్లో అరెస్టులను నివారించగలమా? అని ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. డేటింగ్‌ చేసే బాలురను అరెస్టు చేయడం కన్నా, వారికి సలహా ఇవ్వడానికి పిలవవచ్చునని వ్యాఖ్యానించింది. ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ విధంగా స్పందించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్