అనారోగ్య సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన సంరక్షకుడిని చూసేందుకు ఓ ఏనుగు ఏకంగా ఆస్పత్రి వార్డులోకి వెళ్ళి అందరిని ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఆస్పత్రిలోకి ఏనుగు రావడంతో అంతా దాన్ని చూసి భయపడ్డారు. కానీ ఏనుగు కాళ్ళని నేలపై మోపి పాకుతూ లోపలికి వెళ్లి..బెడ్‌పై పడుకుని ఉన్న తన సంరక్షకుడిని చూసి చలించిపోయింది. ఏనుగు పరామర్శించిన విధానం చూసి అక్కడున్న వారంతా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.