తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాకు చెందిన గాయత్రి ఏపీలో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. జూలపల్లి మండలం వడ్కాపూర్‌కు చెందిన మొండయ్య, లక్ష్మి దంపతుల కుమార్తె గాయత్రి. వరంగల్ కాకతీయ వర్సిటీలో లా చదివారు. అనంతరం పీజీ లా కామన్ ఎంట్రన్స్‌లో నాలుగో ర్యాంక్ సాధించి ఉస్మానియాలో ఎల్ఎల్ఎం అభ్యసించారు. ఇటీవల ఏపీ హైకోర్టు నిర్వహించిన సివిల్ జడ్జి పరీక్షల ఫలితాల్లో ఆమె ఎంపికయ్యారు.