ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లి రైల్వే ట్రాక్ పై నిద్రపోయిన బాలిక.. వీడియో వైరల్

1537చూసినవారు
బీహార్‌లోని మోతిహారిలో షాకింగ్ ఘటన జరిగింది. ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్ళిన ఓ బాలిక రైలు కోసం ఎదురుచూస్తూ పట్టాల పైనే నిద్రపోయింది. అయితే బాలికను గమనించిన లోకో పైలట్ అత్యవసర బ్రేకులు వేసి ఆమె ప్రాణాలు కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే రైల్వే ట్రాక్ పైనుంచి వెళ్ళడానికి నిరాకరించిన సదరు యువతిని స్థానికులు బలవంతంగా ఇంటికి తీసుకెళ్లడం వీడియోలో కనిపిస్తోంది.

సంబంధిత పోస్ట్