గుడ్ న్యూస్.. బడ్జెట్‌లో కేంద్రం ఆ ప్రకటన?

33960చూసినవారు
గుడ్ న్యూస్.. బడ్జెట్‌లో కేంద్రం ఆ ప్రకటన?
కొత్తగా స్మార్ట్ ఫోన్ లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొనుగోలు చేసే వారికి త్వరలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ లో కన్సూమర్ ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్స్ వంటి వాటికి సంబంధించిన విఢిబాగాలు, ఇతర పార్ట్‌లకు సంబంధించి దిగుమతులపై సుంకాలను తగ్గించొచ్చని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే కస్టమ్స్ నిబంధనలను సరళించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ బడ్జెట్‌లో స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్ బ్యాండ్లకు వంటి ఆడియో డివైజ్‌లు, వేరబుల్ డివైజ్‌లకు సంబంధించిన విడిభాగాలపై కూడా కస్టమ్స్ డ్యూటీ తగ్గించొచ్చని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. విడిభాగాలపై దిగుమతి సుంకాల తగ్గించాలని ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ వర్గాల నుండి డిమాండ్ వ్యక్తం అవుతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్