PMFBY కింద తెలంగాణ ప్రభుత్వం త్వరలో పంటల బీమాను అందుబాటులోకి తేనుంది. ఇందుకు సంబంధించి ఈ నెలాఖరు వరకు క్లస్టర్ల వారీగా టెండర్లను స్వీకరించనుంది. బీమా ప్రీమియంలో రైతుల వాటా కూడా ప్రభుత్వమే చెల్లించనుంది. ఇందుకోసం రూ.2,500 కోట్ల నిధులు అవసరం అవుతాయని అంచనా వేస్తోంది. దాదాపు అన్ని పంటలకు బీమాను వర్తింపజేయనున్నట్లు సమాచారం. అయితే ఏ సీజన్ (ఖరీఫ్ORరబీ) నుంచి అమలు చేస్తారనేది క్లారిటీ రావాల్సి ఉంది.