గంజాయిలో ఉండే టెట్రాహైడ్రోకెనబినాయిడ్ (టీహెచ్‌సీ) అనే రసాయనం వ్యక్తులను దానికి బానిసలుగా మారుస్తుంది. అది మెదడుపై తీవ్ర ప్రభావం చూపి శ్రద్ధ, ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది. గంజాయి, మత్తుపదార్థాలను సేవించిన తరవాత వ్యక్తుల్లో చిత్తభ్రమలు మొదలవుతాయి. లేని మనుషులు ఉన్నట్లు, ఏదో చెబుతున్నట్లు భ్రమచెందుతారు. ఆత్మహత్య ఆలోచనలు సైతం వస్తాయి. తమను తాము గాయపరచుకోవడంతో పాటు ఇతరులపై దాడులు, హత్యలు, దొంగతనాల వంటి నేరాలకు ఒడిగట్టే ప్రమాదం ఉంది.