గ్రామీణ కుటుంబాల నెలవారీ తలసరి వ్యయం ఎంతంటే

57చూసినవారు
గ్రామీణ కుటుంబాల నెలవారీ తలసరి వ్యయం ఎంతంటే
దేశంలో కుటుంబాల నెలవారీ తలసరి వినియోగ వ్యయం పట్టణాల్లో 2022-2023లో రూ.6,459కి చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.3,773గా నమోదైంది. మొత్తం వ్యయంలో ఆహార ఖర్చుల వాటా గ్రామీణ ప్రాంతాల్లో 52.9 శాతం నుంచి 46.4 శాతానికి తగ్గింది. పట్టణాల్లో 42.6 శాతం నుంచి 39.2 శాతానికి క్షీణించడం గమనార్హం. జాతీయ గణాంక సర్వే కార్యాలయం నిర్వహించిన ‘గృహ వినియోగ వ్యయ సర్వే (HCES)’ ఫలితాలను శనివారం ప్రభుత్వం వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్