చిరుత నుంచి మాజీ క్రికెటర్‌ను కాపాడిన పెంపుడు కుక్క

570చూసినవారు
చిరుత నుంచి మాజీ క్రికెటర్‌ను కాపాడిన పెంపుడు కుక్క
జింబాబ్వేకు చెందిన మాజీ క్రికెటర్‌ గై విట్టాల్‌ను తన పెంపుడు శునకం కాపాడింది. 51 ఏళ్ల ఈ మాజీ ఆల్‌ రౌండర్ ఇటీవల హ్యూమని ప్రాంతంలో ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. పర్వతారోహణ సమయంలో హఠాత్తుగా ఓ చిరుత విట్టాల్‌పై దాడి చేసింది. దీంతో తన వెంటే ఉన్న తన పెంపుడు కుక్క చికారా చిరుతను ఎదురించింది. రక్తగాయాలైనా యజమానిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. దీంతో చిరుత పరారైంది. కాగా ఈ ఘటనలో విట్టాల్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

సంబంధిత పోస్ట్