ఉగ్రదాడిపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి

72చూసినవారు
ఉగ్రదాడిపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జమ్ముకశ్మీర్​లోని రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడిఘటనపై విచారం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాద వార్త నన్ను తీవ్రంగా కలచివేసిందని, ఈ క్రూరమైన చర్య మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరమని ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్