రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థి మృతి

58చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థి మృతి
శ్రీసత్యసాయి జిల్లా రొళ్ల మండలంలో విషాదం చోటు చేసుకుంది. పిల్లిగుండ్ల గ్రామానికి చెందిన రంగనాథ్, గీతాలక్ష్మీ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు తేజేశ్వర్ రెడ్డి కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. కాలేజీ నుంచి బైక్‌పై హాస్టల్‌కు వెళ్తున్న తేజేశ్వర్ రెడ్డిని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో తేజేశ్వర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్