రీల్స్ పిచ్చి.. బైక్‌పై ప్రమాదకర స్టంట్స్ చేసిన యువకుడు(వీడియో)

53చూసినవారు
ఈ మధ్య కాలంలో యువత రీల్స్ పిచ్చితో రోడ్డుపై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ డైరీ ఫామ్ వద్ద ఓ యువకుడు బైక్‌పై ప్రమాదకర స్టంట్స్ చేస్తూ రెచ్చిపోయాడు. రోడ్డుపై వెళ్తూ బైక్ ముందు టైర్ పైకి లేపి రెండు కిలోమీటర్ల మేర ప్రమాదకరంగా ప్రయాణించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్