ఉత్తరప్రదేశ్ లోని సహరన్‌పూర్‌లో తాజాగా ఘోర ప్రమాదం జరిగింది. ఓ రహదారి ఒక్కసారిగా కూలిపోయింది. రోడ్డు కూలడంతో అక్కడ ఉన్న కౌన్సిలర్‌తో పాటు ఏడుగురు కూలీలు గాయపడ్డారు. స్థానికులు గాయపడిన వారందరినీ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.